అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా కూడేరు లో భార్యపై భర్త దాడి భార్యకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 22, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని కూడేరు మండల కేంద్రంలో భార్య మంగమ్మ పై భర్త రాజప్ప ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.