సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం - ఎమ్మెల్యే షాజహాన్ భాషా.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషా శనివారం స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వాన కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరుగుతున్నదని, ఇది మంచి ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కూటమినాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.