పెద్ద కొడప్గల్: పెద్ద కొడఫ్గల్‌లో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి
పెద్ద కొడఫ్గల్ లో రేషన్ కార్డులను పంపిణీ చేసిన సబ్ కలెక్టర్.... కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నిరంతరంగా జారీ చేస్తామని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ రైతు వేదికలో కొత్త రేషన్ కార్డులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో కలిసి లబ్ధిదారులకు ఆమె అందజేశారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. రేషన్ కార్డు కేవలం బియ్యం కోసం కాకుండా అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగపడుతుందనీ అన్నారు. రేషన్ కార్డు లేని వారు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలని సూచించారు.