మహిళల ఆరోగ్యం బాగుంటే కుటుంబం బాగుంటుంది: పాడేరులో డీఎంహెచ్వో డాక్టర్ టీ.విశ్వేశ్వరనాయుడు
ఈనెల 17వ తేదీ నుండి అక్టోబర్ నెల 2వ తేదీ వరకు మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ టీ.విశ్వేశ్వరనాయుడు తెలిపారు. మహిళల ఆరోగ్యం బాగుంటే కుటుంబం బాగుంటుంది అనే ఆలోచనతో, జిల్లాలోని 64 పీహెచ్సీల ద్వారా నిర్వహించబడే శిబిరాల ద్వారా మహిళలకు వైద్య సేవలు, అవగాహన కార్యక్రమాలు, పోషకాహార సలహాలు, గుండె జబ్బులు, మధుమేహం తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తామన్నారు.