కెవిపియస్ సామాజిక చైతన్య బైక్ యాత్రను జయప్రదం చేయండి : కరపత్రల ఆవిష్కరణలో వక్తలు పిలుపు.
Ongole Urban, Prakasam | Apr 9, 2026
కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సామాజిక చైతన్య బైక్ యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం కెవిపిఎస్ జిల్లా కార్యాలయం ఎల్బీజీ భవనం నందు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా *కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ. రఘురామ్ మాట్లాడుతూ*, ఏప్రిల్ 11 మహాత్మ జ్యోతిబాపూలే జయంతి పురస్కరించుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు జరిగే సామాజిక చైతన్య బైక్ యాత్రను జయప్రదం చేయాలని మొదటగా వారు పిలుపునిచ్చారు, నేటి సమాజంలో దళితులు, పేదలు ఎదుర్కొంటున్న వివక్ష, అంటరానితనం, భూమిలేని పరిస్థితి, గృహ సమస్యలు, నిర్మూలనకు పని చేయాలన్నారు