శ్రీశైలం డ్యాం సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ వీరస్వామి పై తేనెటీగల దాడి అక్కడికక్కడే మృతి
నంద్యాల జిల్లా శ్రీశైలం సుండిపెంటలో విషాద ఘటన చోటుచేసుకుంది.డ్యామ్ ప్రాంతంలో తేనెటీగల దాడిలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి (52) మృతి చెందారు. డ్యాంపై ఉన్న లిఫ్ట్ వద్ద విధి నిర్వహణలో భాగంగా పెట్రోలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి.తేనెటీగల దాడికి భయంతో కిందపడిన వీరస్వామిపై భారీగా కమ్ముకున్న తేనెటీగలు తీవ్రంగా గాయపరిచాయి.అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరు సిబ్బంది గాయపడగా, వారిని సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదం రేపింది.