ఒంగోలు అర్బన్: జిల్లాలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలపై డ్రోన్ ద్వారా సర్వే చేయించబోతున్నట్లూ తెలిపిన కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 22, 2026
జిల్లాలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలపై డ్రోన్ ద్వారా సర్వే చేయించబోతున్నామని కలెక్టర్ రాజాబాబు చెప్పారు. అధికారిక కార్యకలాపాలు, నేర, రోడ్డు ప్రమాదాల నివారణ, విస్తృత ప్రజాప్రయోజనాల కోసం డ్రోన్ల వినియోగం, సీసీ కెమెరాల ఏర్పాటు, సమగ్ర వివరాలతో ' డేటా లేక్ ' నిర్వహణపై అమరావతి సచివాలయం నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ సెక్రటరీ కాటంనేని భాస్కర్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ ఇందులో పాల్గొన్నారు.