అసిఫాబాద్: వాంకిడిలో కమ్ముకున్న పొగ మంచు, ఇబ్బందులు పడ్డ వాహనదారులు
వాంకిడి మండలంలో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఇండ్లు, చెట్లు, వాహనాలపై మంచు తుంపర్లు కురిశాయి. శీతల గాలులు వణికించాయి. పొగమంచు ధాటికి రోడ్లపై ఏమి కనిపించకపోవడంతో వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణించారు. ఉదయం పూట వివిధ పనులకు వెళ్లేవారు, వాకర్లు ఉన్ని దుస్తులు ధరించారు. చలి నుంచి రక్షణకు ఉదయం పూట వేడివేడి టీ తాగి ఆస్వాదించారు.