వరంగల్: వరంగల్లో అట్టహాసంగా జరిగిన రావణవధ: డ్రోన్ కెమెరాలో అద్భుత దృశ్యాలు
వరంగల్ హంటర్ రోడ్ ఉర్సు రంగలీల మైదానంలో రావణవధ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమాన్ని రామినేని భరత్ డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. రావణ దహనాన్ని చూసేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు.