కోడుమూరు: కోడుమూరు పోలీస్ స్టేషన్ ఎదుట హిందూ సంఘాలు నిరసన, వ్యతిరేక పోస్టులపై ఫిర్యాదు
కోడుమూరులో హిందూ సంఘాలు సోమవారం ఆందోళనకు దిగారు. కొందరు దేవుళ్ళకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని పోలీస్ స్టేషన్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటనపై పోలీసులు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.