ఒంగోలు అర్బన్: పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 5, 2026
పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన "అనంత అరణ్య" కార్యక్రమంలో భాగంగా ముండ్లమూరు మండల కేంద్రంలోని పిఎం శ్రీ ఏపి మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజి అవరణలో జిల్లా కలెక్టర్ రాజాబాబు మొక్కలు నాటడంతో పాటు మొక్కలు నాటేందుకు వీలుగా గుంతలు తవ్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు.