నంద్యాల అర్బన్: నేరస్థులకు శిక్ష పడేలా చార్జి సీటు దాఖలు చేయాలి నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్
Nandyal Urban, Nandyal | Jun 16, 2026
నంద్యాలజిల్లాలో పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులను గడువులోగా పరిష్కరించాలని నంద్యాల SP సునీల్ షౌరాణ్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. నమోదైన కేసులలో సమగ్ర దర్యాప్తు చేపట్టి, నేరస్తులు తప్పించుకోకుండా న్యాయస్థానాలలో బలమైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టాలన్నారు. నిందితులకు తగిన శిక్ష పడేలా పక్కాగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.