యాడికి లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున చెన్నకేశవ స్వామి కళ్యాణోత్సవాన్ని వేదమంత్రోచ్ఛరణల నడుమ మంగళ వాయిద్యాలతో వేద పండితులు ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి అనంతపురం జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు చెందిన భక్తులు, ప్రజలు తరలి వచ్చారు.ఆధ్యాత్మిక శోభ వెళ్లి వెలిసింది.