మనుషులు ప్రాణాలు పోతున్న చీమకుట్టినట్లు కూడా లేదా ..?
కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని వైసీపీ మహిళా నేత కాకాని పూజిత ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కల్తీ మద్యం కేసును సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ను కావాలనే కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు