ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వాహనదారులకు హెల్మెట్ పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఫైన్ విధించిన పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 13, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శనివారం పోలీసులు వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. హెల్మెట్ పై ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వాహనదారులకు పోలీసులు జరిమానా విధించినట్లు తెలిపారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని ప్రమాదానికి కారణమైతే వాహనం నడిపిన వ్యక్తి వాహనం ఇచ్చిన వ్యక్తి నేరస్తులు అవుతారని పోలీసులు తెలిపారు.