ఒంగోలు అర్బన్: ఒంగోలులో ప్రశాంతంగా ముగిసిన JMB చర్చి ఎన్నికలు.. పాస్టర్ ఆగస్టన్ విజయం సాధించడంతో ఆయన వర్గాలు ఆనందం
Ongole Urban, Prakasam | May 23, 2026
ఒంగోలులో JMB చర్చి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. పాస్టర్ అగస్టన్ విజయం సాధించినట్లుగా అధికారులు వెల్లడించారు. గత కొద్దిరోజులుగా ఈ చర్చి కార్యవర్గ సభ్యుల నియామకం వివిధంగా మారింది. కోర్టు ఆదేశాలు కార్యవర్గ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికలు పూర్తి చేశారు. ఎన్నికలు పూర్తి కావడంతో కార్యవర్గ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అతి త్వరలో కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు.