ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని జూనియర్ కళాశాలలో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా టిడిపి అధ్యక్షులు ఉగ్ర నరసింహ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అనారోగ్య సమస్యలు ఉన్న ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అండగా ఉండడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యమని ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.