రాజేంద్రనగర్: యాదవులు నిజమైన సమాజ సేవకులు: షాద్నగర్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
యాదవులు నిజమైన సమాజ సేవకులని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలో జరిగిన సదర్ ఉత్సవాలు ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని రంగాల్లో యాదవులు కీలకపాత్ర పోషించారని, కాంగ్రెస్ మొదటి నుంచి యాదవులకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను ఇచ్చిందని పేర్కొన్నారు. సదర్ సంబరాలు పట్టణంలో పెద్దఎత్తున నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు.