గుంతకల్లు: పట్టణంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ పంపిణీ చేశారు. గుంతకల్లు పట్టణంలోని నామాల సేట్ కళ్యాణమండపంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామితో కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా ఎంతో మంది అనారోగ్యం కారణంగా ఆసుపత్రులలో చికిత్సలు చేయించుకొని ఆర్థిక ఇబ్బందులు తన దృష్టికి తెచ్చారని అన్నారు. బాధితులు సరైన పత్రాలను అందజేయడంతో రూ.24,65,372 మంజూరు చేయించానని అన్నారు.