నారాయణపేట్: హిందూ పండగల సమయంలో ఆర్టీసీ బస్ చార్జీలు పెంపు సరికాదు: విశ్వహిందూ పరిషత్
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపో ముందర శనివారము 10:30 గంటల సమయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల పండుగలు రాఖీ పూర్ణిమ, బతుకమ్మ, దసరా, దీపావళి తదితర పండగల సమయంలో ఆర్టిసి బస్సుల చార్జీలు పెంచడం సరైనది కాదని అన్నారు. పల్లె వెలుగుతో సహా అన్ని బస్ ఛార్జీలు పెంచడం ఏంటని ప్రశ్నించారు. ఇక మీదట హిందువుల పండుగలకు బస్ ఛార్జ్ లు పెంచిన చో రాష్ట్రవ్యాప్తంగా విహెచ్పి ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకో లు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం డిఎం కు వినతి పత్రాన్ని సమర్పించారు.