ఒంగోలు అర్బన్: ఒంగోలులో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు 78 అర్జీలు సమర్పించిన అర్జీదారులు
Ongole Urban, Prakasam | Jun 1, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సోమవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ప్రజలు 78 అర్జీలను సమర్పించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడిన హర్షవర్ధన్ రాజు వచ్చిన అర్జీలు అన్నిటిని పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఉదయం 11 గంటల వరకే ఈ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు.