సేవలతోనే సమాజంలో గుర్తింపు: బేతంచెర్లలో రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ గోపాలకృష్ణ
Dhone, Nandyal | May 4, 2025 సేవలతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని రోటరీక్లబ్ జిల్లా గవర్నర్ గోపాలకృష్ణ అన్నారు. ఆదివారం బేతంచెర్ల రోటరీక్లబ్ కమ్యూనిటీ కార్యాలయంలో సమాజ సేవలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని సత్కరించుకోవడం అభినందనీయమన్నారు. బేతంచెర్ల పట్టణంలో రోటరీక్లబ్ స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో పాటు ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్చంద సేవా సంస్థల్లో సేవలు అందించిన వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.