మదనపల్లెలో మనస్థాపం చెంది వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య.
కేసు నమోదు చేసిన పోలీసులు .
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం, పోతబోలు గ్రామంలో ఉపేంద్ర 35 సంవత్సరాలు మనస్థాపన చెంది ఆదివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపేంద్ర మదనపల్లెలో ఓ ప్రవేట్ ఆసుపత్రి నందు ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు . ఘటన స్థలానికి మదనపల్లె తాలూకా పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచనామ నిమిత్తం మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది