ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని బొడ్రాయి సెంటర్లో కాపు నేతల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, రంగా తనయుడు వంగవీటి రాధా కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహన్రంగా, దర్శి మాజీ సర్పంచ్ కనకం వెంకయ్య విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ డాక్టర్ వృత్తిని వదిలేసి ప్రజాసేవ కోసం వచ్చామని ప్రజలకు అండగా ఉంటామన్నారు. రంగా పదవుల కోసం రాజకీయంలోకి రాలేదు అణగారిన వర్గాలకు అండగా ఉండేందుకు రాజకీయల్లోకొచ్చారన్నారు.