నాగర్ కర్నూల్: గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేస్తాను : ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిరంతరం కృషి చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించేలా చూస్తానని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని శ్రీపురం గ్రామం ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు.