మంత్రి ఆదేశాలతో సంజీవపురం లోని కేజీబీవీ పాఠశాలలో కొత్త ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు
బత్తలపల్లి మండలం సంజీవపురం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో శనివారం నూతన ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం బిజెపి నేత హరీష్ బాబు పాల్గొని మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ జరిగిన సందర్భంగా ఆర్వో వాటర్ ప్లాంట్ రిపేరు వచ్చిన విషయం తెలుసుకొని మంత్రి సత్య కుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మంత్రి తక్షణమే స్పందించి నూతన వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వడంతో శనివారం ఆర్వో వాటర్ ప్లాంట్ బిగించినట్లు తెలిపారు. అనంతరం హరీష్ బాబు పాఠశాలలో విద్యార్థులకు అందించే ఆహారాన్ని కూరగాయలను తనిఖీ చేశారు.