సిగనాపల్లి రంగురాళ్ల క్వారీ ప్రాంతాన్ని పరిశీలించిన గూడెం కొత్తవీధి ఎస్సై కే.సురేశ్
గూడెం కొత్తవీధి మండలంలోని సిగనాపల్లి రంగురాళ్ల క్వారీలో ఎవరైనా అక్రమంగా రంగురాళ్ల తవ్వకాలు చేపడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై కే.సురేశ్ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం సిగనాపల్లి రంగురాళ్ల క్వారీ ప్రాంతాన్ని సందర్శించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించారు. రంగురాళ్ల తవ్వకాలు చేపట్టడం చట్టరీత్యా పెద్ద నేరమన్నారు. సిగనాపల్లి క్వారీలో తవ్వకాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని, విచారణ చేపట్టామన్నారు.