ఒంగోలు అర్బన్: ఒంగోలు ఏబీఎన్ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన వైసిపి నాయకులు, వెంటనే సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
Ongole Urban, Prakasam | Apr 8, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 'వీకెండ్ కామెంట్ బై ఆర్కే' ప్రోగ్రాంలో వైసీపీ అధినేతపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఏబీఎన్ పత్రిక, ఛానెల్ కావాలనే తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని మండిపడ్డారు. కార్యాలయం ముందు బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు