అన్నమయ్య జిల్లా, కె.వి.పల్లి మండలం — దేవరపల్లి గ్రామానికి చెందిన అంజీ మృతిపై అతని భార్య శ్రీదేవి తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె రాయచోటి ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.శ్రీదేవి వివరాల ప్రకారం...తాను అనారోగ్యంతో కువైట్ నుండి భారతదేశానికి వస్తుండగా, మార్గమధ్యంలోనే భర్త చనిపోయాడని సమాచారం అందిందని తెలిపారు. భర్త మృతదేహాన్ని చూడనివ్వకుండా తనను, తన కూతురిని కొట్టి తరిమేశారంటూ ఆమె ఆరోపించారు.భర్త మరణం వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని, పోస్టుమార్టం నిర్వహించి నిజాలను వెలికితీయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేసింది.