జహీరాబాద్: జహీరాబాద్ రైల్వే స్టేషన్ లో రైలు నుండి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో రైలు నుండి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం షిరిడి నుండి తిరుపతి వెళుతున్న ట్రైన్ జహీరాబాద్ రైల్వే స్టేషన్లో ఆగుతున్న సమయంలో ఔరంగాబాద్ కు చెందిన అనిల్ కేడ్క్కో అనే వ్యక్తి వాటర్ బాటిల్ కోసం దిగుతూ ప్రమాదవశాత్తు జారిపడి ట్రైన్ కింద పడడంతో రెండు చేతులను కోల్పోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతని జహీరాబాద్ ఆసుపత్రి కి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.