సిరిసిల్ల: గ్యాస్ స్టవ్ పైనే వంటలు సిద్ధం చేయాలి
గ్యాస్ స్టవ్ పైనే విద్యార్థులకు ఆహార పదార్థాలను సిద్ధం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం చింతల్ ఠాణా ఆర్&ఆర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూర్తి చేసిన కిచెన్ షెడ్, విద్యాలయం ఆవరణను పరిశీలించారు. విద్యాలయం ఆవరణలో నీరు నిలవకుండా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.ఈ పర్యటన లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు, ఉపాధ్యాయులు పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.