రాజేంద్రనగర్: తురక యంజాల్ మున్సిపల్ పరిధిలో కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్లో మైనారిటీ మహిళలకు MLA మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకము "రేవంతన్న భరోసా" కింద 200 కుట్టు మిషన్లను అందించారు. KCR తమకు ఏమి చేయలేదని, రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుందని, అన్ని పథకాలు మాకు అందుతున్నాయని ఓ మహిళ తన అభిప్రాయం వ్యక్తం చేసింది