టంగుటూరు మండలంలోని బెల్లం కోటయ్య పొగాకు కంపెనీలో శనివారం అర్ధరాత్రి తర్వాత అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదంలో దాదాపు కోట్ల రూపాయలు చేసే పొగాకు కాలిపోయినట్లుగా అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆరు గంటలకు పైగా సమయం దాటిన పొగాకు మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ప్రస్తుతం అధికారులు మంటలు కొనసాగుతున్నాయని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఎంత మొత్తంలో పొగాకు కాలిపోయిందో అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు.