రాప్తాడు: రామ్ నగర్ లో బాబు రెడ్డికి నివాళులర్పించిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం జిల్లా కేంద్రంలో రాంనగర్ నందు సోమవారం ఐదున్నర గంటల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మేనత్త భర్త అయిన బాబు రెడ్డి సోమవారం మధ్యాహ్నం మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనంత వెంకటరామిరెడ్డి తదితరులు సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో బాబు రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన పార్టీవదేహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు ఎఫ్ సి ఐ గోడాను పునర్ ప్రారంభించడంలో బాబు రెడ్డి ఎంతో కృషి చేయడం జరిగిందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.