పందలపర్రులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు
నిడదవోలు మండలం పందలపర్రులో గురువారం ఉదయం 10:30 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. 46.60 వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం భవనాన్ని, 26.80 లక్షల జయంతో నిర్మించిన గ్రామ వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాన్ని, 23.94 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాన్ని నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి, జడ్పిటిసి కొయ్య సూరిబాబు, వైకాపా మండల అధ్యక్షుడు ఐనీడి పల్లారావు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.