ఒంగోలు అర్బన్: అంధురాలు ఆదిలక్ష్మిని హత్య చేసిన నిందితుని వివరాలను వెల్లడించిన ఎస్పీ హర్షవర్ధన్
Ongole Urban, Prakasam | May 14, 2026
బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ డిపో సమీపంలోని లాడ్జిలో హత్యగావించబడిన అంధురాలు మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగిని ఆదిలక్ష్మి హత్య కేసు కు సంబంధించిన నిందితుని వివరాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు లాడ్జి రికార్డుల ఆధారంగా నిందితుడు వెంకటరమణ అని త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని తెలియజేశారు నిందితున్ని అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలియజేశారు నిందితునికి సంబంధించిన పూర్తి వివరాలను విచారణ చేస్తున్నట్లుగా ఎస్పీ తెలియజేశారు