అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం యలగలవంక గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులు అనన్య మరియు హరిత జిల్లా స్థాయి జిజ్ఞాస 2025 అగస్త్య ఫౌండేషన్ ఆన్లైన్ సైన్స్ ఫెయిర్ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు రఘురాం మంగళవారం తెలియజేశారు. తర్ఫీదును ఇచ్చిన సైన్స్ ఉపాధ్యాయులు సూరిబాబు సార్ మరియు వెంకటరామిరెడ్డి సార్ లను ప్రధానోపాధ్యాయులు మరియు సహో ఉపాధ్యాయులు అభినందించారు. అలాగే రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా విజయవంతం కావాలని ప్రధానోపాధ్యాయులు మరియు సహో ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.