నెక్కొండ: ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలివరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ నెక్కొండ పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం నెక్కొండ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు.