అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ లో రేషన్ బియ్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ : వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ వెల్లడి
బ్రాండెడ్ బియ్యం పేరుతో రేషన్ బియ్యం అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. శివాజీ చౌక్ లోని ఆంధ్ర కిరాణా షాపు యజమాని షేక్ అయుబ్ ను అరెస్టు చేసి ఒక ఆటో, 6 క్వింటాళ్ల రాయితీ బియ్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇది వరకే నిందితుడిపై పలు కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. నిందితున్ని దుకాణం జప్తు కోసం ఆర్డీఓకు సిఫార్సు చేశామని సీఐ తెలిపారు.