నడిగూడెం: నడిగూడెంలో విద్యార్థి సూసైడ్ ఘటనలో డీఈఓ అశోక్ వివరణ
నడిగూడెం కస్తూర్బాలో పదో తరగతి విద్యార్థిని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే.సమాచారం అందుకున్న డీఈఓ అశోక్ కస్తూర్బా హాస్టల్ను పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కుటుంబ సమస్యలతోనే విద్యార్థిని తనూజ ఆత్మహత్యకు పాల్పడిందని వెల్లడించారు. అర్ధరాత్రి తర్వాత లేచి పక్కనే ఉన్న తన ఫ్రెండ్ని చున్నీ అడిగి క్లాస్ రూమ్లోకి వచ్చి సూసైడ్ చేసుకుందని తెలిపారు.