మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మార్కాపురం జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలన్నారు.