సర్వేపల్లి: పాటూరు వారి కండ్రిగలో జడ్పీ సీఈవో మోహన్ రావు ఆకస్మిక తనిఖీ, శానిటేషన్ పర్యవేక్షణ
ముత్తుకూరు మండలం పాటూరు వారి కండ్రిగ గ్రామంలో జడ్పీ సీఈవో మోహన్ రావు గురువారం ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న శానిటేషన్ పర్యవేక్షించారు. ఇంటింటికి వెళ్లి గ్రామంలో శానిటేషన్ వలన కలిగే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఇంటిలో తడిచెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇచ్చి సహకరించాలని కోరారు.