అనంతపురం అర్బన్: ధర్మవరం రైల్వే స్టేషన్ లో ప్రమాదవశాత్తు రైలులో నుంచి పడి కర్నాటక లోని గుల్బర్గాకు చెందిన యువకుడికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 6, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం పట్టణంలోని రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తు రైలులో నుంచి కింద పడటంతో కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు చెందిన ప్రజ్వల్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన యువకుడిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.