కర్నూలు: రేపు సోమవారం పోలీస్ ప్రజా ఫిర్యాదుల వేదిక రద్దు : జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 20న జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు. కర్నూలు కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఈ వేదిక జరగాల్సి ఉంది. పండుగ కారణంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో కార్యక్రమం నిలిపివేశామని ఎస్పీ పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుండి అర్జీలు ఇవ్వడానికి వచ్చే ప్రజలు వ్యయ, ప్రయాసలతో రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఎస్పీ విక్రాంత్ పాటిల్.