కనిగిరి: హనుమంతుని పాడు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్
హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ ను కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర యశ్వంత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులను, సిడి ఫైల్స్ ను డీఎస్పీ పరిశీలించారు. అనంతరం ఎస్ఐ కే మాధవరావుతో పాటు పోలీస్ సిబ్బందితో సమావేశమైన డీఎస్పీ... హనుమంతుడుపాడు మండలంలో నేరాల కట్టడికి గస్తీని ముమ్మరం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్ కేసులు, మిస్సింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలని, నేర నియంత్రణకు కృషి చేయాలని ఆదేశించారు. కనిగిరి సీఐ ఖాజావలి పాల్గొన్నారు.