నంద్యాల అర్బన్: నంద్యాల సన్ రైజ్ జూనియర్ కాలేజీ ప్రకటనలకు మోసపోవద్దు: విద్యార్థి సంఘాలు
Nandyal Urban, Nandyal | May 7, 2026
ప్రభుత్వ అనుమతులు లేని నంద్యాలలోని సన్ రైజ్ జూనియర్ కళాశాలను తక్షణమే సీజ్ చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. వివిధ ప్రకటనలతో తప్పుడు ర్యాంకులు చూపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థి సంఘ నాయకులతో కలిసి కళాశాల ఏర్పాటుచేసిన బ్యానర్స్ను తొలగించినట్లు PDSU నేత రాంబాబు తెలిపారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.