బనగానపల్లె: బనగానపల్లెలో ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం
నంద్యాల జిల్లా బనగానపల్లెలోని CMR ఫంక్షన్ హాల్ సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 13 ఏళ్ల బాలికను ఒక వ్యక్తి బలవంతంగా బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలికను పళ్లతో కొరకడంతో ఆమెకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. బాలిక తమ్ముడు గమనించి కేకలు వేయడంతో స్థానికులు స్పందించి నిందితుడిని పట్టుకొని చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.