వేములవాడ: కూష్మాండ అలంకారంలో శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు..అర్చకులు ఏం చెప్పారో మీరే వినండి
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం నాలుగో రోజు కూష్మాండ అలంకారంలో శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాలు రాజన్న గుడిలో వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అర్చకుడు గోపన్నగారి చందు మీడియాతో మాట్లాడుతూ..అమ్మవారిని పూజించడం లేదా దర్శించడం ద్వారా పుణ్య ఫలాలు లభిస్తాయని తెలిపారు.