కొత్తగూడెం: కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బొగ్గు టిప్పర్, ద్విచక్ర వాహన దారుడు మృతి
కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హనుమాన్ బస్తీకి చెందిన వేణుగోపాల్ ద్విచక్ర వాహనంపై మంగళవారం రుద్రంపూర్ నుండి కొత్తగూడెం వస్తున్న క్రమంలో, కొత్తగూడెం నుండి బొగ్గు టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది.. వేణుగోపాలకు తీవ్రగాయాలు కావటంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి 108 వాహనంలో కుత్తడం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. వేణుగోపాల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..