పెద్ద కడబూరు: మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఏవో సుచరిత గైర్హాజరుపై ఎంపీపీ శ్రీవిద్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలలకొకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశానికి ఆయా శాఖల అధికారులు తమ ప్రతినిధులను పంపడం సరికాదన్నారు.అధికారులు తప్పనిసరిగా హాజరై తమ ప్రగతి నివేదికను సమావేశంలో వివరిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఆయా శాఖల తరుపున వచ్చిన ప్రతినిధులను సమస్యలను ఎలా చెపుతారన్నారు.